- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రమాదం జరిగితే తప్ప అధికారులు స్పందించరా.. ?
దిశ, శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ శివరాం పల్లి ప్రశాంత్ కాలనీలో విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరాయి. ప్రమాదాలను పొంచి ఉన్న విద్యుత్ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత ఐదు రోజుల క్రితం ఈ స్తంభాలకు ఆనుకొని ఉన్న ఎండిన చెట్టును డీసీఎం ఢీకొనడంతో ఆ చెట్టు పూర్తిగా స్తంభానికి ఉన్న తీగలపై పడటంతో మరింత ప్రమాదాన్ని పొంచి ఉంది.
ఈ మార్గంలో నిత్యం వాహనాలు, పాఠశాలలో రాకపోకలు సాగుతుండటంతో ఇప్పుడేం ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాడైన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని ఐక్యత వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన అధికారులు పట్టించుకోవడంలేదని విచారం వ్యక్తం చేశారు. అధికారుల తీరు చూస్తుంటే ప్రమాదం జరిగితే తప్ప... పట్టించుకోము అన్నట్లుగా అనిపిస్తుంది. అసలే వర్షాకాలం కావడంతో ఏ క్షణం ప్రమాదం సంభవిస్తుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.