- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురుకులాలపై సీఎం రేవంత్ రివ్యూ చేయాలిః మాజీ మంత్రి హరీష్ రావు
దిశ, శంషాబాద్ : ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం తప్ప విద్యపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతూ అడిగితే వేధిస్తున్నారని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారిపై ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పాఠశాలలో ప్రభుత్వంలోకి వస్తున్న ఏ ఒక్క సదుపాయాన్ని కూడా తమకు అందించడం లేదని.. పురుగుల అన్నం పెడుతున్నారని.. అడిగితే టీచర్లు విచక్షణా రహితంగా కొడుతున్నారని, చదువు సరిగా చెప్పడం లేదని కులం పేరుతో దూషిస్తున్నారని మాజీ మంత్రులతో విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. దీంతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని.. రాష్ట్రంలోని పాలలను గాడికి వదిలేశారని మండిపడ్డారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో వందలాది గురుకుల పాఠశాలలు తెచ్చి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించామని.. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే విద్యాశాఖ పెట్టుకుని ఆ విద్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా అడిగిన వారిని టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని గురుకుల పాఠశాలపై రివ్యూ నిర్వహించాలన్నారు.
ముఖ్యమంత్రి వద్ద ఉన్న విద్యాశాఖలోనే ఇవన్నీ అవకతవకలు జరుగుతుంటే పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెలయ్యారన్నారు. పాఠశాలలో ఏ విద్యార్థిని అడిగిన అన్నంలో పురుగులు వస్తుంటే మేం తినలేక పోతున్నామని చెబుతున్నారని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. విద్య కూడా చెప్పకుండా టీచర్లు గైడ్లు చూసి రాసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని విద్యార్థులు చెప్పడం చూస్తే రాష్ట్రంలో విద్య ఎటు పోతుందని ఆందోళన వ్యక్తం అవుతుందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకులాలు విద్యపై రివ్యూ నిర్వహించి, పాలమాకులలో జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారించి పాఠశాలల్లో ఉన్న టీచర్లను మొత్తం బదిలీ చేసి కొత్త స్టాపు పెట్టాలన్నారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో విద్యార్థులు చెబుతున్న విషయాలు చూస్తే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయన్నారు. రోజు తినే అన్నంలో పురుగులు వస్తున్నాయి సాంబార్లో నీళ్లు రాళ్లు వస్తున్న ఇలాంటి టీచర్లకు చెబితే అవి తీసేసి తినాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు. గత అసెంబ్లీ సమావేశాలలో కూడా గురుకుల పాఠశాలలో అవకతవకలు జరుగుతున్నాయి భోజనం సరిగా పెట్టట్లేదని విద్య సరిగా అందడం లేదని ప్రశ్నిస్తే మాపై అవాకులు చివాకులు పేలుస్తూ ఏదైనా చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 9 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు గురుకుల పాఠశాలపై ప్రభుత్వం ఒక రివ్యూ చేసిన పాపను పోలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్తీక్ రెడ్డి,దిద్యాల శ్రీనివాస్, బుర్కుంట సతీష్, శంకర్ రెడ్డి, చక్రధర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మోహన్ రావు, గౌస్ బాష తదితరులు పాల్గొన్నారు.