దారుణం.. ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన రూ.14 వేల అప్పు

by Gantepaka Srikanth |
దారుణం.. ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన రూ.14 వేల అప్పు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు(Tamil Nadu)లోని తిరుపత్తూరు(Tirupathur) జిల్లా అంపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించడం లేదని ఇద్దరు చిన్నారులను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంపూర్‌కు చెందిన వసంత్ కుమార్ అనే వ్యక్తి.. తన మిత్రుడైన యోగరాజ్‌కు రూ.14 వేలు అప్పుగా ఇచ్చాడు. తిరిగి డబ్బులు అడగ్గా.. యోగరాజ్‌ దాటవేస్తూ వచ్చాడు. ఇదే విషయమై వీరిద్దరు గొడవలు పడుతూ వస్తున్నారు.

ఇటీవల మరోసారి డబ్బుల విషయమై యోగరాజ్‌ను గట్టిగా మందలించగా.. మళ్లీ సమయం కావాలని అడిగాడు. దీంతో వనంత్ కుమార్ ఆగ్రహానికి గురయ్యాడు. యోగరాజ్ ఇద్దరు కొడుకులను స్నాక్స్‌ కొనిస్తానని తీసుకెళ్లి దారుణంగా హత్య చేసి చంపాడు. గమనించిన స్థానికులకు పోలీసులకు సమాచారం ఇవ్వగా అసలు విషయం బయటపడింది. దీంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతులు యోగిత్(6), దర్శన్ (04)గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story