- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Middle East on boil: హెజ్బొల్లా పై విరుచుకుపడిన ఇజ్రాయెల్..1000 రాకెట్ లాంచర్ బారెల్స్ ధ్వంసం!
దిశ, వెబ్ డెస్క్: లెబనాన్(Lebanon) లో పేజర్లు(Pagers), వాకీ టాకీ(walkie, talkie)ల పేలుళ్ళ క్రమంలో..పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ దళాలు(Israeli forces) హెజ్బొల్లా(Hezbollah)ను లక్ష్యంగా చేసుకొని తీవ్రంగా దాడులు చేస్తున్నాయి. దక్షిణ లెబనాన్ లో హెజ్బొల్లా స్థావరాలపై ఫైటర్ జెట్లతో ఇజ్రాయెల్ బీకర దాడులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా గురువారం అర్ధరాత్రి నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ దళాలు 1000 హెజ్బొల్లా రాకెట్ లాంచర్ బారెల్స్ ను ధ్వంసం చేసింది.అయితే ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకోవడానికే ఆ రాకెట్ లాంచర్ బారెల్స్ ను హెజ్బొల్లా మోహరించినట్లు.. ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే హెజ్బొల్లా దాడులను కట్టడి చేసేందుకు తమ దాడులు తీవ్రతరం చేస్తున్నట్లు ఐడీఎఫ్(Israel Defense Forces) ప్రకటించింది. దీంతో మధ్య ప్రాచ్యంలోని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వందలాది సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి.