- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
iPhone - Apple : ఆపిల్ ఐ ఫోన్లకు ఎగబడ్డ జనం
దిశ, వెబ్ డెస్క్ : ఆపిల్ ఐ ఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందన్నది మరోసారి రుజువైంది. గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం శుక్రవారం తెల్లవారుజాము నుంచి దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ ఫోన్ల కొనుగోలు కోసం జనం ఆపిల్ కంపనీ స్టోర్ల ముందు బారులు తీరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏఐ సాంకేతికతో ఆపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తో శక్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ముంబై, ఢిల్లీతో సహా పలు నగరాల్లోని ఆపిల్ స్టోర్ల బయట క్యూ కట్టారు. జనం ఉదయం నుంచే స్టోర్ల దగ్గర లైన్ కట్టి మరీ ఆపిల్ ఐ-ఫోన్ 16లను ఎగబడి కొంటున్నారు. ఇండియాలో ఈరోజు నుండే ఐఫోన్ 16 సేల్స్ ప్రారంభమైంది. ఐ ఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్.. అనే నాలుగు మోడళ్లను ఆపిల్ తీసుకొచ్చింది. వీటిల్లో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను జత చేశారు. అదే విధంగా ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ ఏ18తో వచ్చింది. ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లలో ఆపిల్ ఇంటెలిజెన్స్ యూఎస్ ఇంగ్లీష్ వర్షన్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ వచ్చేనెలలో అందిస్తుంది. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 79,900గా, ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900గా, ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 1,19,900గా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభం ధర రూ. 1,44,900గా ఉన్నాయి. ఈ ఫోన్లు 128 జీబీ స్టోరేజీ, 256 జీబీ స్టోరేజీ, 512 జీబీ స్టేరేజీ వేరియంట్లలో లభిస్తాయి.