Congress: రేపటి నుంచి జిల్లాల వారీగా సమీక్ష.. పార్టీ కార్యాచరణ ప్రకటించిన మహేశ్‌కుమార్ గౌడ్

by Prasad Jukanti |
Congress:  రేపటి నుంచి జిల్లాల వారీగా సమీక్ష.. పార్టీ కార్యాచరణ ప్రకటించిన మహేశ్‌కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన టీ కాంగ్రెస్ ఆ దిశగా జోరు పెంచుతోంది. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన నూతన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇవాళ పార్టీ కార్యాచరణ ప్రకటించారు. రేపటి నుంచి జిల్లాల వారీగా గాంధీ భవన్ లో సమీక్షలు నిర్వహించబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదట వరంగల్ జిల్లా, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కరీంనగర్ జిల్లా 4 గంటల నుంచి 6 గంటల వరకు నిజామాబాద్ జిల్లా సమీక్ష సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమీక్షలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, సంయుక్త కార్యదర్శి పీసీ విష్ణునాథ్ తో పాటు పీసీసీ అధ్యక్షులు, మంత్రులు, జిల్లా ఇంచార్జ్ మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థుల, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్ లు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యే లు, మాజీ ఎమ్మెల్సీ లు, ఫ్రంటల్ చైర్మన్ లతో పాటు ముఖ్య నాయకులు పాల్గొనున్నార. మరో వైపు మంత్రులు గాంధీ భవన్ కు వచ్చే కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్నది. ఇకపై ప్రతి బుధ, శుక్ర వారాలలో ఒక మంత్రి గాంధీ భవన్ లో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.

Advertisement

Next Story

Most Viewed