Tirupati Prasadam: ఇది సనాతన ధర్మం పై జరిగిన కుట్ర! తిరుపతి లడ్డూ కల్తీపై రామ్ జన్మభూమి ప్రధాన పూజారి కీలక వ్యాఖ్యలు

by Geesa Chandu |
Tirupati Prasadam: ఇది సనాతన ధర్మం పై జరిగిన కుట్ర! తిరుపతి లడ్డూ కల్తీపై రామ్ జన్మభూమి ప్రధాన పూజారి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(TTD) లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు(Animal fats) కలిపిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరపాలని రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్(Acharya Satyendra Das) డిమాండ్ చేశారు.ఆయన ఓ ఆంగ్ల మీడియా సంస్థతో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా రామ్ జన్మభూమి పూజారి మాట్లాడుతూ.."ఇప్పటివరకూ తిరుపతి లడ్డూ ప్రసాదంపై జరిగిన పరిశీలనలో.. చేప నూనె వంటివి కలిసినట్లు నిర్ధారణ అయినందువల్ల ఇది సనాతన ధర్మం పై జరిగిన కుట్రగా తాము భావిస్తున్నామని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. తిరుపతి వేంకటేశ్వర స్వామి పట్ల, ఆయన లడ్డూ ప్రసాదం పట్ల ప్రజలకు అపారమైన భక్తి, నమ్మకం ఉండటం వల్లనే భక్తులు ఈ లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. అందువలన వారి నమ్మకాన్ని కాపాడడానికి ఈ ఘటన పై కచ్చితంగా దర్యాప్తు జరగాలి" అని పూజారి సత్యేంద్ర దాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాగా, ఇప్పటికే శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డు(National Dairy Development Board) ల్యాబొరేటరికి పంపగా.. రిపోర్టులో అది కల్తీ నెయ్యి అని తేలింది. అంతేకాకుండా లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించినట్లు స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed