Pawan Kalyan: జంతువుల కొవ్వుతో తిరుమల లడ్డూ.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన ట్వీట్

by Shiva |
Pawan Kalyan: జంతువుల కొవ్వుతో తిరుమల లడ్డూ.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డూ (Tirumala Laddu)పై వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల సీఎం చంద్రబాబు (CM Chandrababu) శ్రీవారి లడ్డూ ప్రసాదం‌పై చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తిరుమల సనాతన సాంప్రదాయాలను, పవిత్రతను మంటగలిపేలా వైసీపీ ప్రభుత్వం (YCP Government) వ్యవహరించిందని ఆయన ఫైర్ అయ్యారు. తాజాగా లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడినట్లుగా ల్యాబ్ రిపోర్ట్స్ (Lab Reports) బయటకు రావడంతో ఆయా పార్టీల నాయకులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా (Social Media) వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి బాలాజీ (Tirumala Balaji) ప్రసాదంలో జంతువుల కొవ్వును ఉపయోగించిన విషయం తెలిసి మనమంతా కలత చెందామని అన్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు (TTD Board) ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో బాధ్యలుపై కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉందని తెలిపారు. దేవాలయాల అపవిత్రత, భూమి సమస్యలు, ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన అనేక సమస్యలపై నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయని అన్నారు. మొత్తం దేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ (Sanatana Dharma Rakshana Board)ను ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయవ్యవస్థ, పౌరులు, మీడియాలో చర్చ జరగాలని అన్నారు. ‘సనాతన ధర్మాన్ని’ (Sanatan Dharma) పవిత్రం చేసేందుకు అందరూ కలిసి రావాలని తాను భావిస్తున్నానని పవన్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed