- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేవాలయ భూములకే పంగనామం.. రెచ్చిపోతున్న రియల్ మాఫీయా
దిశ, గండిపేట్ : గండిపేట మండల పరిధిలో దేవాదాయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎకరాలకు ఎకరాలు భూములు మాయం అవుతున్న అధికారులకు మాత్రం కనిపించడం లేదని అంటున్నారు. అసలు దేవాదాయ శాఖ అధికారులు ఉన్నారా లేరా అనే సందేహం కలిగేలా అధికారులు ప్రవర్తిస్తున్నారు. గండిపేట మండల పరిధిలోని మణికొండ మున్సిపాలిటీలో దేవాదాయ భూమి ఆక్రమణకు గురైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపురి తుల్జా రాం దేవాలయం సమీపంలో సర్వే నెంబర్లు 116, 112, 125 లలో అక్రమ నిర్మాణాలు యదేచ్చగా కొనసాగుతున్నాయి. పట్టించుకోకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు.
మున్సిపాలిటీలో ఈ దేవాలయానికి సంబంధించి 28 ఎకరాల 24 గంటల భూమి ఉండగా ప్రస్తుతం స్థానికులు చెబుతున్నారు. అయినా దేవాదాయ రెవెన్యూ శాఖల అధికారులు కళ్ళు మూసుకొని ఈ నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్నారు. మరి దేవాదాయ శాఖ భూములు ఆక్రమణకు గురవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏకంగా 28.24 ఎకరాల భూమి ఉండగా అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టి ఐదు ఐదు ఎకరాలకే పరిమితం చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్, విద్యుత్‌శాఖ అధికారుల సహకారంతోనే ఈ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నట్లు స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా మణికొండ మున్సిపాలిటీ పరిధిలో దేవాదాయ భూముల ఆక్రమణ అడ్డుకొని తిరిగి దేవాలయానికి ఇప్పించాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకోవడంలో విఫలం...
దేవాదాయ శాఖ చెందిన భూములు అని తెలిసినప్పటికీ ఇక్కడ అనేకమంది కబ్జాదారులు కబ్జాలు చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ నిర్మాణాల పట్ల జాగ్రత్త వహించాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులు తమకు వచ్చిన విధంగా నిర్మాణాలు చేపట్టి వాటిని అన్ని సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు మాత్రం ఈ అంశంపై నోరు మెదపకపోవడం సర్వత్ర పలు అనుమానాలకు తావిస్తుందని స్థానికులు అంటున్నారు.
కొన్ని నిర్మాణాలు కూల్చేసి.. మరికొన్ని వదిలేసి..
మణికొండ మున్సిపాలిటీలో చేపట్టే అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు కంటి తుడుపు చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు అంటున్నారు. సర్వే నెంబరు 116, 112, 125 నిర్మాణాలు చేపడితే 116 లోని నిర్మాణాలను కూల్చివేసి మిగిలిన సర్వే నెంబర్లలో వదిలేశారని ఆరోపణలను స్థానికులు వినిపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నోటీసులు ఇచ్చాం : ఈవో అరుణకుమారి
దేవాదాయ శాఖకు చెందిన భూముల రిజిస్ట్రేషన్లు చేయవద్దని అధికారులకు తెలిపాం. అయితే నిర్మాణాలు చేపడుతున్న వారికి నోటీసులు సైతం ఇచ్చాం. దేవాదాయ శాఖకు చెందిన భూములలో నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు, విద్యుత్ అధికారులు సహకరిస్తున్నారని ఈ మేరకు ఆయా శాఖల అధికారులతో చర్చిస్తున్నట్లు వివరించారు. దేవాదాయ భూముల్లో ఆక్రమణలు చేసిన నిర్మాణాల పట్ల సెప్టెంబర్ 6 న ఉత్తర్వులు జారీ అవుతాయి. ఈ భూములకు సంబంధించి సర్వే చేయించుకోకుండా కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దేవాలయ భూములను నొక్కాలనే ఉద్దేశ్యంతో కబ్జాదారుడు కబ్జాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. గండిపేట్‌కు సర్వేయర్ వచ్చాక సర్వే చేయిస్తాం.