- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇస్లామిక్ కాంగ్రిగేషన్ కార్యక్రమానికి సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి
దిశ, శంకర్ పల్లి : శంకరపల్లి లో జనవరి 4, 5 తేదీల్లో నిర్వహించనున్న ఇస్లామిక్ కాంగ్రిగేషన్ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శంకరపల్లి మున్సిపల్ పరిధిలోని ఇస్లామిక్ కాంగ్రిగేషన్ నిర్వహించే స్థలంలో మంగళవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, చేవెళ్ల ఆర్డిఓ చంద్రకళ, నార్సింగ్ ఏసిపి రమణ గౌడ్ తో కలిసి ఆయా శాఖల అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. విద్యుత్, వైద్యం, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్లు, పంచాయతీ రాజ్ రోడ్లు భవనాల శాఖ తదితర శాఖల అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు.
జనవరి 4, 5 తేదీల్లో ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి హాజరయ్యే మైనారిటీస్ సోదరులు పాల్గొని కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు వచ్చే ఒక రోజు ముందు రోజు కార్యక్రమం పూర్తయిన తర్వాత వెళ్లే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శంకర్పల్లి పట్టణం ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. చేవెళ్ల నుంచి వికారాబాద్ నుంచి పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు నుంచి శంకరపల్లి కి చేరుకునే రహదారులను అందుకు ప్రత్యామ్నాయ రోడ్లను కూడా పరిశీలించాలని, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను కూడా సరిచూసుకోవాలని సూచించారు.
శంకరపల్లి నుంచి పటాన్చెరు రోడ్డు వెడల్పు కార్యక్రమం పూర్తి చేయాలని, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రోడ్డు నుంచి బిడియల్ రోడ్డును పంచాయతీరాజ్ అధికారులు వెడల్పు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 11 ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు వైర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు, మునిసిపల్ అధికారులు ఆయా రోడ్ల వెంబడి కార్యక్రమం జరిగే స్థలం చుట్టూ వీధిలైట్ల ఏర్పాటు కార్యక్రమాన్ని చూడాలని శానిటేషన్ పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, మొబైల్ టాయిలెట్లు కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమానికి అవసరమయ్యే ఏర్పాట్లకు సంబంధించిన నిధులకు సంబంధించి పరిపాలనా అనుమతులు ఈరోజే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ వెంకట రామిరెడ్డి, శంకర్పల్లి తాసిల్దార్ సురేందర్,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఇంచార్జ్ ఎంపీడీవో గిరిరాజ్,ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.