CV Anand: సంధ్య థియేటర్ వద్ద గాయపడ్డ బాలుడికి CP పరామర్శ

by Gantepaka Srikanth |
CV Anand: సంధ్య థియేటర్ వద్ద గాయపడ్డ బాలుడికి CP పరామర్శ
X

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌(Sri Tej)ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) పరామర్శించారు. వైద్యుడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని రిక్వెస్ట్ చేశారు. కాగా, శ్రీతేజ్ గత 13 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప-2 సినిమా ప్రీమియర్ షోకు వచ్చి గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి మృతిచెందింది. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు సాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. చికిత్స ఖర్చులూ భరిస్తానని, ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed