- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సోషల్ మీడియాలో కోతి రాములు ఉన్నారు.. ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..

దిశ, నకిరేకల్ : సోషల్ మీడియాలో కొందరు కోతి రాములు ఉన్నారని కోతికి కొబ్బరి చిప్ప దొరికితే గోకానాక అన్నట్లుగా వాళ్ళ వ్యవహారం ఉందని ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. సందర్భం వచ్చినప్పుడు ఆ కోతి రాముడు ఎవరు చెబుతానన్నారు. అది అసలే కోతి ఇంకేముంది కళ్ళు తాగిన కోతుల ఇష్టా రీతిలో మాట్లాడుతుందని వారికి తగిన బుద్ధి తప్పదని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో జరిగిన చిట్ చాట్ లో బుధవారం ఉదయం ఈ విధంగా మాట్లాడారు.
దళితులు అంటే వారికి ఈర్ష్య. లీకుల అలవాటు వారికి ఉందని గతంలో వాళ్ళు లీకులు చేసి బయటపడ్డ విషయం అందరికీ తెలుసు అన్నారు పల్లి బఠానీలకు అమ్ముకున్నారని హెద్దేవా చేశారు. చదువు విలువ మాకు తెలుసని మేము అటువంటి పొరపాటు చేయలేదని దమ్ముంటే మాతో డైరెక్ట్ గా ఎదుర్కోవాలన్నారు. అనవసరంగా నా పేరు తీస్తే దళిత సమాజం ఏమనుకుంటుందోనన్న భయం వారికి ఉంది అందుకే ఆకాశరాముల ఉత్తరాలకు స్పందిస్తున్నారని ఆరోపించారు. ఏదో ఉత్తరాలు బయటకు వస్తే నేను బయటకు వస్తానని వారి ఉద్దేశం అన్నారు. పరీక్ష నిర్వహణకు ఒక సిస్టం ఉంటుందని ఆ సిస్టం అడిగితే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు. నన్ను గెలకొద్దు గెలిపించుకోవద్దని హెచ్చరించారు.