బ్రష్ చేసుకుంటేనే... లిప్ కిస్ పెడతా.. నటి బోల్డ్ కామెంట్స్!

by Veldandi saikiran |   ( Updated:2025-03-26 05:16:39.0  )
బ్రష్ చేసుకుంటేనే... లిప్ కిస్ పెడతా.. నటి బోల్డ్ కామెంట్స్!
X

దిశ వెబ్ డెస్క్: బ్రష్ చేసుకుంటేనే లిప్ లాక్ ఇస్తానని ప్రముఖ నటి సురభి లక్ష్మి ( Surabhi Lakshmi ) షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఆమె గతంలో జరిగిన గురించి.. గుర్తు చేసుకుంటూ... ఈ వ్యాఖ్యలను చేశారు. మలయాళ సినిమా రైఫిల్ క్లబ్ ( Rifle Club) 2024 లో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రైఫిల్ క్లబ్ సినిమాలో నటి సురభి లక్ష్మి కీలక పాత్ర పోషించారు. ఇక తాజాగా ఈ సినిమాలో జరిగిన ముద్దు సీన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటి సురభి లక్ష్మి.


ఈ సినిమాలో... తన సహ నటుడు సజీవ్ కుమార్ తో ( Sajeev Kumar) లిప్ కిస్ సీన్ ( Lip Kiss ) ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే... ఈ సీన్ చేసే ముందు... తన సహ నటుడు సజీవ్ కుమార్ ను బ్రష్ చేసుకోమని.. తాను ముందే సూచించినట్లు ఆమె వెల్లడించారు. ఆయనకు విపరీతంగా సిగరెట్ తాగే అలవాటు ఉందని... అందుకే లిప్ కిస్ సీన్ కంటే ముందు.. బ్రష్ ( బ్రష్ ) చేయాలని కోరినట్లు వివరించారు. ఆ సమయంలో తాను యాలకులు తిన్నట్లు కూడా క్లారిటీ ఇచ్చారు నటి సురభి లక్ష్మి. అనంతరం ఈ రొమాంటిక్ సీన్ ను... చాలా సాధారణంగా షూట్ చేయాలని.. విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. సినిమాలో కచ్చితంగా రొమాంటిక్ సీన్స్ ఉండాల్సిందేనని.. దానివల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయని వివరించారు. అందుకే తాను కూడా రొమాంటిక్ సీన్లకు... ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు.

Read More..

Nayanthara: ప్రముఖ డైరెక్టర్‌తో నయనతారకు గొడవ.. అసలు విషయం చెప్తూ నటి ఆసక్తికర పోస్ట్

Next Story

Most Viewed