- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జాబితా విడుదల!.. ఇండియాలో మోస్ట్ పవర్‌ఫుల్ యాక్టర్ మనోడే.. తెలుగోడు అంటే మినిమమ్ ఉంటది మరి..

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగాడు. కానీ, ‘పుష్ప’(Pushpa) మూవీతో ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప-2’(Pushpa-2)తో మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక ఈ మూవీకు స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వం వహించగా.. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది.
అయితే కలెక్షన్ల విషయంలోను ఏమాత్రం తగ్గేదేలే అంటూ భారీ వసూళ్లు సాధించింది ఈ సినిమా. ఇక రిలీజ్‌కు ముందే పుష్ప-2 మూవీ ప్రిమియర్స్ షో వేయగా.. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా అతని కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇక ఈ ఘటనలో బన్నీ పై కేసు కాగా ఒక రోజు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు బన్నీ. ప్రస్తుతం బన్నీ రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. త్వరలోనే వీటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2025లో టాప్ 100 అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాను విడుదల చేసింది. అయితే అందులో రాజకీయ నాయకులు కానీ పాపులర్ సెలబ్రిటీల లిస్ట్‌లో మన ఐకాన్ స్టార్ 92ప్లేస్‌లో ఉన్నాడు. అలాగే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్(97వ స్థానం), అమితాబ్ బచ్చన్(99 వ స్థానం), బాలీవుడ్ బ్యూటీ(100వ స్థానంలో) ఉన్నారు. ఇక సౌత్ ఇండియన్ స్టార్స్ నుంచి హీరో అల్లు అర్జున్ పేరు మాత్రమే ఉండటంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు తెలుగోడు అంటే మినిమమ్ ఉంటది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.