- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బౌన్సర్లుగా రోబోలు.. ఫైటింగ్ లో శిక్షణ.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

దిశ, వెబ్ డెస్క్: రోజులు మారినాకొద్దీ... కొత్త కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఈ తరుణంలోనే... ప్రస్తుతం చాలా దేశాలు రోబోలను రంగంలోకి దించాయి. మనుషుల స్థానంలో.. రోబోలతో పనులు చేయించుకుంటున్నాయి. చైనా, జపాన్ లాంటి దేశాల్లో ప్రతి సెక్టార్లో రోబోలను వాడుతున్నారు. దీనివల్ల ఉపాధి జనాలు కోల్పోయినప్పటికీ... టెక్నాలజీ పేరుతో రోబోలను తీసుకువస్తున్నారు.
రోబోలతో ఫైటింగ్
చైనాలో రోబోలను చాలావరకు వాడుతున్నారు. అయితే ఇప్పుడు ఆ రోబోలతో... కుంగ్ ఫు లాంటి విద్యలు కూడా నేర్పిస్తున్నారు. హ్యూమనాయిడ్ రోబోలకు కుంగ్ ఫు లాంటి విద్యలు నేర్పిస్తున్నారు. ఇక... ట్రైనర్.... చెప్పినట్లుగానే ఆ రోబోలు కూడా ప్రతి విషయాన్ని పాటిస్తున్నాయి. ముందు నుంచి ఎవరైనా అటాక్ చేస్తే... ఎలా ఎదుర్కోవాలి ? ఎదురుదాడి ఎలా చేయాలి ,? అనే విషయాలను క్లారిటీగా నేర్పిస్తున్నారు. ఇక ట్రైనర్ చెప్పినట్లుగానే ఆ రోబోలు కూడా చాలా చక్కగా.. చేసేస్తున్నాయి. చిన్న మిస్టేక్ లేకుండా... మనిషి కంటే చాలా తెలివిగా రోబోలు ప్రవర్తిస్తున్నాయి. ఇక సడన్ గా ఎవరైనా వెనకనుంచి.. అటాక్ చేస్తే కూడా బ్యాలెన్స్ చేసుకునే అంత.. టెక్నిక్స్ కూడా నేర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కిరాయికి రోబోలు
చైనాలో హ్యూమనాయిడ్... రోబోలను అద్దెకు కూడా ఇస్తున్నారు. ఇందులో యూనిట్రీ జీ 1 హ్యూమనాయిడ్ రోబోలను మాత్రమే అద్దెకి ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీటిని ఒక్కరోజు అద్దెకి ఇస్తే... 1000 యువాన్లు చెల్లించాలట. అంటే దాదాపు 1400 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అద్దెకు తీసుకువచ్చిన రోబోలతో మనం ఎలాంటి పనులను అయినా చేయించుకోవచ్చు. డాన్స్ చేయడం, వంట, ఇంటి క్లీనింగ్, ఇతర అన్ని పనులకు ఈరోబలను వాడుకోవచ్చట. ఈ రోబోలను యూనిట్రీ రోబోటిక్స్ కంపెనీ అభివృద్ధి చేస్తోంది.
బౌన్సర్లుగా రోబోలు..
ఇక భవిష్యత్తులో.. ఈ రోబోలతో... సెక్యూరిటీ పనులు కూడా చేయించుకునేలా కనిపిస్తున్నారు. వాచ్ మెన్, భద్రతా సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ, ఇలా చిన్న చిన్న పనులకు కూడా... ఈ రోబోలను వాడుకునేలా కనిపిస్తున్నారు. త్వరలో ఈ టెక్నాలజీ ని కూడా అందుబాటులోకి.. తీసుకువచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి టెక్నాలజీ వాడితే... డబ్బులు కూడా సేవ్ అవుతాయని వాదన కూడా వినిపిస్తోంది.