OTT PlatForms : ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కేంద్రం వార్నింగ్

by M.Rajitha |
OTT PlatForms : ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కేంద్రం వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ క్రమంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌(OTT PlatForms)కు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కంటెంట్‌పై ఎలాంటి నియంత్రణ లేదని.. సినిమాలు, వెబ్‌ సిరీస్‌ను తప్పనిసరిగా సెన్సార్‌ చేయాలనే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ(Union Ministry of Information and Broadcasting) ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు అడ్వైజరీ(Advisory)ని జారీ చేసింది. ఇకపై డ్రగ్స్(Drugs) వినియోగాన్ని ప్రోత్సహించడం, గ్లామరైజ్ కంటెంట్‌ను చూపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సినిమాలు, సీరియల్స్‌లో నటులు మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించే సన్నివేశాలను యూజర్ వార్నింగ్ లేకుండా ప్రసారం చేయకూడదని చెప్పింది. అలాంటి సున్నితమైన కంటెంట్‌ ద్వారా యువత ప్రభావితమయ్యే అవకాశం ఉందని, వాటి వినియోగానికి సంబంధించిన సీన్స్‌ చూపించే సమయంలో తప్పనిసరిగా హెచ్చరికలు ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed