రైలులో అక్రమంగా ఢిల్లీ నుండి తీసుకువచ్చిన మద్యం సీసాలు పట్టివేత

by Kalyani |
రైలులో అక్రమంగా ఢిల్లీ నుండి తీసుకువచ్చిన మద్యం సీసాలు పట్టివేత
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : ఢిల్లీ నుండి అక్రమంగా తీసుకువచ్చిన మద్యాన్ని ఎక్సైజ్ , ఎస్టీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు. మహబూబ్ నగర్ కు చెందిన రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ నుంచి అక్రమంగా మద్యం బాటిళ్లను తీసుకువచ్చి నగరంలో విక్రయాలు చేపడుతున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం రైలులో మద్యం సీసాలను నగరానికి తీసుకు వస్తున్నారనే సమాచారం అందడంతో ఎక్సైజ్‌, ఎస్టీఎఫ్ పోలీసులు సికింద్రబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో తనిఖీలు చేపట్టగా రాజశేఖర్‌రెడ్డి మద్యంతో పట్టుబడ్డారు. అతని వద్ద నుంచి 35 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్టీఎఫ్ సీఐలు చంద్రశేఖర్ గౌడ్,కోటమ్మ తెలిపారు. పట్టుబడిన మద్యం సీసాలలో 24 రెడ్ లేబుల్ , 11 డిఫెన్స్ కు చెందినవి ఉన్నట్లు వెల్లడించారు. ఢీల్లీలో మద్యం ధరలు తెలంగాణతో పోలిస్తే సగం ధరలకు వస్తాయని, దీంతో చాలా మంది ఢిల్లీ నుంచి అక్రమంగా తెలంగాణకు రైల్లో మద్యాన్ని తీసుకుని వచ్చి అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారని, అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story