- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నక్ష బాట పై విచారణ
దిశ, జిన్నారం: జిన్నారం మండలంలోని ఊట్ల గ్రామ పరిధిలో గల 527 సర్వేనెంబర్ లోని భూమిలో నక్ష బాట కబ్జా అయిన కథనాలు 'దిశ' దిన పత్రికలో ప్రచురితం ఆయన విషయం తెలిసిందే. హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా భారీ నిర్మాణాలను చేపట్టడంతో పాటు నక్ష బాటను కబ్జా చేసిన విషయాన్ని స్థానికులు ఇటీవల హెచ్ఎండీఏ అధికారులకు ఫిర్యాదులు చేశారు. కాగా మంగళవారం హెచ్ఎండీఏ ఏపీఓ సువర్ణ నక్ష బాటను కబ్జా చేస్తూ చేపట్టిన భారీ నిర్మాణాలను, హెచ్ఎండీఏ నుంచి ఉన్న అనుమతులను పరిశీలించారు. హెచ్ఎండీఏ నుంచి తీసుకున్న అనుమతులను పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని సువర్ణ తెలిపారు. హెచ్ఎండీఏ అనుమతులు లేకపోవడంతో పాటు నక్ష బాటను కబ్జా చేసి, నాలా ఉన్న భూమిని సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, తక్షణమే విచారణ జరిపి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు హెచ్ఎండీఏ అధికారులను కోరారు.
చేతులెత్తేసిన రెవెన్యూ అధికారులు
జిన్నారం మండల రెవెన్యూ అధికారులు నక్ష బాట కబ్జా విషయంలో చేతులెత్తేశారు. చుట్టూ ప్రహరీ నిర్మించిన ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు ఉన్నాయనే విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేకపోయారు. నక్ష బాట పేరిట కేవలం గోడను కూల్చివేసి ఇదే రోడ్డు అని తేల్చి చెప్పి రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకున్నారు. ఊట్ల - మంగంపేట గ్రామాలను కలిపే పూర్తిస్థాయి రోడ్డును రెవెన్యూ అధికారులు బయటకు తీయలేకపోయారు. అక్రమంగా భారీ నిర్మాణం చేపడుతున్న వ్యక్తులకు రెవెన్యూ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి నక్ష బాటను పూర్తిస్థాయిలో వెలికి తీసి, రెండు గ్రామాలను కలిపే రోడ్డు పూర్తి చేయించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.