లగచర్ల రైతుల కేసులను ఎత్తివేయాలి.. మాజీ మంత్రి

by Sumithra |
లగచర్ల రైతుల కేసులను ఎత్తివేయాలి.. మాజీ మంత్రి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : వికారాబాద్ జిల్లా లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ పోలీసు కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం అన్ని జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు, స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలను తీసుకోకుండా, వారికి ఇష్టం లేకుండా వారి భూములను లాక్కోవడం సరికాదని, అక్కడ భూ సేకరణ రద్ధయ్యే వరకు పోరాడుతూ, వారికి న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన నిలబడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ గౌడ్, కేసీ నర్సింహులు, గంజి వెంకన్న, శివరాజ్, కరుణాకర్ గౌడ్, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, జంబులయ్య, నరేందర్, అన్వర్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed