Kadapa: వైఎస్ షర్మిల బర్త్ డే వేడుకల్లో భగ్గుమన్న విభేదాలు

by srinivas |   ( Updated:2024-12-17 12:29:46.0  )
Kadapa: వైఎస్ షర్మిల బర్త్ డే వేడుకల్లో భగ్గుమన్న విభేదాలు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బర్త్ డే వేడుకల్లో ఒక్కసారిగా విభేదాలు బయటపడ్డాయి. కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిల బర్త్ డే వేడుకలు నిర్వహించారు. అయితే కాంగ్రెస్ నేతలు బాహ బాహికి దిగారు. జిల్లా అధ్యక్షులు విజయజ్యోతి, నగర అధ్యక్షులు అఫ్జల్ ఖాన్ మధ్య వాగ్వాదం జరిగింది. షర్మిల బర్త్ డే వేడుకలపై తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని అఫ్జల్ ఖాన్ ఫైర్ అయ్యారు. నగర అధ్యక్షులుకు తెలియకుండా ఎలా వేడుకలు నిర్వహిస్తారని నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. వెంటనే విజయజ్యోతి అక్కడి నుంచి వెను దిరిగి వెళ్లిపోయారు. తమకు అధిష్టానం నుంచి మెసేజ్ ద్వారా పార్టీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామని, ఈ విషయాన్ని వైఎస్ షర్మిల వద్దే తేల్చుకుంటామని విజయజ్యోతి తెలిపారు.

Advertisement

Next Story