- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RRR: బిహైండ్ అండ్ బియాండ్ ట్రైలర్
దిశ, సినిమా: ‘RRR’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రశంసలు అందుకుని ఆస్కార్(Oscar Award)తో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి (Director Rajamouli) తెరకెక్కించిన ఈ మూవీలో రామ్ చరణ్(Ram Charam), ఎన్టీఆర్ (NTR)ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్దా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు వసూలు చేసి కొత్త రికార్డులు సృష్టించింది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాపై డాక్యుమెంటరీని సిద్ధం చేసినట్లు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా ‘ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’(RRR: Behind and Beyond) ట్రైలర్ రిలీజ్ చేసింది. ట్రైలర్‌లో మొదటగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం ఇద్దరు పులులతో కలిసి వర్క్ చేశాను. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డారు’ అని తెలిపారు. అంతే కాకుండా ఇందులో నటించి రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్ కూడా సినిమా గురించి పంచుకున్నారు. కాగా.. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ ఈ డిసెంబర్ 20న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.