Entrance exams: ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం

by Prasad Jukanti |
Entrance exams: ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వివిధ యూనివర్సిటీల పరిధిలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు (common entrance examination) కన్వీనర్లను ఉన్నత విద్యా మండలి నియమించింది. ఆయా విశ్వవిద్యాలయాల ఉపకులపతులను సంప్రదించి కన్వీనర్లను (Cet convenors appointed) నియమిస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈఏపీసెట్ బాధ్యతలు జేఎన్ టీయూ హెచ్ కు అప్పగించగా కన్వీనర్ గా ప్రొఫెసర్ బి. డీన్ కుమార్ ను నియమించారు. టీజీ పీజీ ఈసెట్ ను జేఎన్ టీయూహెచ్ కు అప్పగించగా కన్వీనర్ గా ప్రొఫెసర్ ఎ. అరుణ కుమారికి, టీజీ ఐసెట్ ను మహాత్మగాంధీ యూనివర్సిటీకి, కన్వీనర్ గా ప్రొఫెసర్ అలువల రవి, టీజీ ఈసెట్ ను ఉస్మానియా యూనివర్సిటీకి కన్వీనర్ గా ప్రొఫెసర్ పి. చంద్రశేఖర్ ను, టీజీ లా సెట్, టీడీ పీటీ లాసెట్ ను ఉస్మానియాకు, కన్వీనర్ గా ప్రొఫెసర్ బి. విజయలక్ష్మి, టీడీ ఎడ్ సెట్ ను కాకతీయ యూనివర్సిటీకి కన్వీనర్ గా ప్రొఫెసర్ బి. వెంకటరాం రెడ్డి, టీజీ పీఈసెట్ ను పాలమూరు యూనివర్సిటీకి కన్వీనర్ గా ప్రొఫెసర్ ఎన్.ఎస్ దిలీప్ ను నియమించారు. వీటికి సంబంధించిన షెడ్యూల్స్ త్వరలోనే ప్రకటిస్తామని టీజీసీహెచ్ ఈ పేర్కొంది.

Advertisement

Next Story