- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi Elections: వచ్చే ఏడాది ఆరంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections) త్వరలోనే జరగనున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఢిల్లీ ఎన్నికలపై సన్నాహక సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ వారంలోనే ఎన్నికల నిర్వహణపై అధికారులతో భేటీ కానున్నట్లు తెలిసింది. సమావేశం అయిన వెంటనే ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విడుదల చేసింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషీ బరిలో దిగనున్నారు. తమ పార్టీ పూర్తి విశ్వాసంతో, పూర్తి సన్నద్ధతతో ఎన్నికల్లో పోటీ చేస్తోందని కేజ్రీవాల్ తెలిపారు.
ఇంకా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
మరోవైపు, ఢిల్లీలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది. కొత్త అభ్యర్థుల పేర్లనే ప్రకటించనుంది. అయితే, ఇప్పటివరకు ఏ ఒక్క జాబితాను కాషాయ పార్టీ విడుదల చేయలేదు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని కమలం పార్టీ వెల్లడించింది. 1998 నుండి బీజేపీ ఢిల్లీలో అధికారంలో లేదు. 2015 నుండి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ వరుసగా 67, 62 స్థానాలు గెలుచుకుని ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇకపోతే, ఢిల్లీలో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగనుంది.