- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖానాపూర్ లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి
దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్ లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అసెంబ్లీలో కోరారు. మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖానాపూర్ ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని అబద్దపు మాటలు చెప్పి అధికారాన్ని చేజిక్కించుకున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు. గతంలో అనేక సార్లు ఖానాపూర్ ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఉద్యమాలు, ధర్నాలు రాస్తారోఖోలు నిర్వహించారని గుర్తు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలో ఖానాపూర్ ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామని, కచ్చితంగా ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని త్వరగా ఖానాపూర్ రెవెన్యూ డివిజన్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కరీంనగర్ జిల్లా సిద్దిపేట ఆర్టీసీ డిపో నుండి దస్తురాబాద్ మండలం గోడిసిర్యాల మీదుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వరకు బస్సులను మళ్లించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేశారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. బస్సులను మళ్లించడం ద్వారా అనేక మంది రవాణా కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు.