SSC Stenographer Key: ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ ప్రిలిమినరీ కీ విడుదల.. అభ్యంతరాలకు డిసెంబర్ 18 వరకు గడవు..!

by Maddikunta Saikiran |
SSC Stenographer Key: ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ ప్రిలిమినరీ కీ విడుదల.. అభ్యంతరాలకు డిసెంబర్ 18 వరకు గడవు..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్(Stenographer) పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) గత జులై నెలలో నోటిఫికేషన్(Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మొత్తం 2006 స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సీ(గ్రూప్ బీ, నాన్ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డీ (గ్రూప్ సీ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబర్ 10, 11వ తేదీల్లో పరీక్షలను నిర్వహించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT), స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్(Skill Test) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇదిలా ఉంటే.. ఈ నియామక పరీక్షలకు సంబంధించి రెస్పాన్స్ షీట్(Response Sheet), ప్రిలిమినరీ కీ(Preliminary key)ని ఎస్‌ఎస్‌సీ తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.gov.in/ ద్వారా తమ రూల్ నంబర్(Roll No), పాస్ వర్డ్(Password) డీటెయిల్స్ ఎంటర్ చేసి రెస్పాన్స్ షీట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కీ పై ఏమైనా అభ్యంతరాలు(Objections) ఉంటే డిసెంబర్ 16 నుంచి 18 లోపు తెలియజేయాలని ఎస్‌ఎస్‌సీ సూచించింది.


Advertisement
Next Story

Most Viewed