- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sitara Ghattamaneni: స్పెషల్ వీడియో షేర్ చేసిన మహేష్ బాబు గారాలపట్టి
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ ప్రముఖ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గారాల పట్టి సితార(Sitara Ghattamaneni) ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. తరచూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ఈ వయస్సులోనే తండ్రికి తగ్గ కూతురిగా గుర్తింపు సంపాదించుకుంటోంది. అయితే తాజాగా సితార సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఇకపోతే డిసెంబరు 20 వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న ముఫాసా ది లయన్ కింగ్(Mufasa the Lion Kin) సినిమాలోని ముఫాసా రోల్‌కు సూపర్‌స్టార్ మహేష్ బాబు వాయిస్ అందించిన విషయం తెలిసిందే.
కాగా దీనిపై సితార ఓ వీడియో విడుదల చేసింది. ఈ మూవీలో ముఫాసా ఒక ఐఖానిక్ రోల్(Iconic role) పోషిస్తున్నారు. కాగా నాన్న వాయిస్ ఇచ్చినందుకు గర్వంగా ఉందని వెల్లడించింది. కానీ నాన్న రియల్ లైఫ్‌లో కూడా ముఫాసా లాంటివారని తెలిపింది. మమ్మల్ని కూడా ముఫాసా చిత్రంలో తన బిడ్డల్ని ఎలా చూసుకుంటుందో.. ఎంతగా ప్రేమిస్తుందో అంతే ప్రేమిస్తాడని తెలిపింది. నాన్న ముఫాసాగా చేస్తున్నడని తెలిశాక, చాలా హ్యాపీగా, ఎగ్జైటింగ్‌గా అనిపించిందని సితార వివరించింది. కానీ నాన్న ఇందుకోసం చాలా కష్టపడ్డాడని వెల్లడించింది. ట్రైలర్ వీక్షించిన ప్రతీసారి సంతోషంగా అనిపిస్తుందని.. ఈ మూవీ చూడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానని.. మీరు కూడా ముఫాసా సినిమా చూడండి. మిస్ అవ్వకండంటూ సితార వీడియోలో చెప్పుకొచ్చింది.