కాంగ్రెస్ నిర్లక్ష్యానికి ఈ మరణం మరొక ఉదాహరణ.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2025-04-01 15:22:54.0  )
కాంగ్రెస్ నిర్లక్ష్యానికి ఈ మరణం మరొక ఉదాహరణ.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ మరణం మరొక ఉదాహరణ అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి అనారోగ్యంతో మరణించాడు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై విమర్శలు (Criticize) చేశారు.

ఈ సందర్భంగా ఆయన.. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) సిర్గాపూర్ మండలం (Sirgapur Mandal) నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో (Nallavagu Social Welfare Gurukula School) 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నిఖిల్ మరణం చాలా బాధాకరమని అన్నారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. అలాగే 83 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే కూడా కనీస దిద్దుబాటు చర్యలు చేపట్టని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఈ మరణం మరొక ఉదాహరణ అని దుయ్యబట్టారు.

అంతేగాక చిన్న జ్వరానికే (Small Fever) విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం శోచనీయమని, కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాల నిర్వహణ వైఫల్యానికి (Gurukulas Maintanance Failure) ఇదొక నిదర్శనమని మండిపడ్డారు. ఒక గురుకులంలో 400 మంది విద్యార్థులనే సమర్థవంతంగా చూసుకోలేని ప్రభుత్వం, 2000 మంది ఉండే ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్వహణను (Integrated Schools Maintanance) ఎలా చేయగలదు? అని నిలదీశారు. ఇక గురుకులాల్లో చదువుతున్న దళిత, బహుజన విద్యార్థుల ప్రాణాలను రక్షించే చర్యలు చేపట్టాలని, చనిపోయిన విద్యార్థి నిఖిల్ కుటుంబానికి రూ.15 లక్షల నష్టపరిహారం (Compensation) ఇవ్వాలని బీఆర్ఎస్ (BRS) తరపున హరీష్ రావు డిమాండ్ చేశారు.

Next Story