- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చీ చీ ఇదేం పాడు పని.. విద్యార్థినిని గదిలోకి తీసుకెళ్లిన ఉపాధ్యాయుడు.. ఆ తర్వాత!?

దిశ,వెబ్‌డెస్క్: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్‌లో విద్యార్థిని పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బద్వేల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో(Little Flower School) ఓ ఉపాధ్యాయుడు నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని పై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు అతనికి దేహశుద్ధి చేశారు.
విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఆగ్రహానికి గురైన పేరెంట్స్ పొట్టు పొట్టు కొట్టారు. అయితే.. తనను తరగతి గదిలోకి తీసుకెళ్లి ప్రైవేట్ పార్టులపై చేయి వేశాడని ఆ చిన్నారి విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు తల్లిదండ్రులు ఇరుగుపొరుగు వారితో కలిసి స్కూల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో సదరు ఉపాధ్యాయుడి పై దాడి చేసి పోలీసులకు అప్పగించారు.