కొలికిపూడి వర్సెస్ రమేశ్ రెడ్డి: అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ

by srinivas |
కొలికిపూడి వర్సెస్ రమేశ్ రెడ్డి:  అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా తిరువూరు(Krishna district Tiruvur)లో కొంత కాలంగా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు(MLA Kolikipudi Srinivasa Rao) తీరు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలతో దూకుడుగా వ్యవరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొలికిపూడి అందరినీ కలుపుకుని పోడనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయన్ను అధిష్టానం వరకూ తీసుకెళ్లాయి. అప్పుట్లో క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం సర్దుమనుణిగింది.

అయితే రెండు రోజుల క్రితం కొలికిపూడి రాజీనామా ప్రకటన పార్టీ దుమారం రేపింది. గిరిజన మహిళను వేధించిన నేపథ్యంలో టీడీపీ నేత రమేశ్ రెడ్డిపై 48 గంటల్లో చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని కొలికిపూడి హెచ్చరించారు. అంతేకాదు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు కొలికిపూడి వ్యవహారంపై అధిష్టానం సీరియస్ అయింది. తిరువూరులో అసలేం జరుగుతుందనే దానిపై ఎంపీతో పాటు జిల్లా అధ్యక్షుడి ద్వారా నివేదికలు తెప్పించుకుంది. పూర్తి పరిశీలన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే తిరువూరు నియోజకవర్గం టీడీపీ నేతలను తీసుకుని మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి రమేశ్ రెడ్డి వెళ్లారు. ఎమ్మెల్యే కొలికిపూడిపై ఫిర్యాదు చేశారు. కొలికిపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.

మరోవైపు డెడ్‌లైన్ ముగియడంతో కొలికిపూడి రాజీనామా చేస్తాడా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. రాజీనామాపై మీడియా ప్రశ్నలకు కొలికిపూడి దాటవేత ధోరణి చూపినట్లు తెలుస్తోంది. కొలికిపూడి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. చూడాలి ఏం జరుగుతుందో.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed