బూతు ఆడియోలు లీక్.. ఒక్క దెబ్బకే ముగ్గురు అక్కాచెల్లెల్లు మూసుకున్నారుగా..!

by Bhoopathi Nagaiah |
బూతు ఆడియోలు లీక్.. ఒక్క దెబ్బకే ముగ్గురు అక్కాచెల్లెల్లు మూసుకున్నారుగా..!
X

అలేఖ్య చిట్టి పికిల్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు. ఇది నాన్‌వెజ్ పచ్చళ్లకు ఫేమస్. అంత పాపులర్‌గా నడుస్తున్న పచ్చళ్ల వ్యాపారం ‘బూతు ఆడియో’ల మూలంగా ఒక్కసారిగా ఆన్‌లైన్‌లో దుకాణం బంద్ చేయాల్సిన పరిస్థితికి దారితీసింది. చిట్టి, అలేఖ్య, రమ్య అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు పచ్చళ్ల వ్యాపారం ఎలా స్టార్ట్ అయింది..? ఎలా మూత పడిందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్న ఈ ఎన్నికకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఇవాళ్టితో ముగిసింది. బీజేపీ, ఎంఐఎం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, ఎంఐఎం మధ్యే పోటీ ఉండటంతో హైదరాబాద్ రాజకీయం వేడెక్కింది. మరి ఈ రెండు పార్టీల నుంచి ఎవరు బరిలో ఉన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకుందాం.

తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆమెతోపాటు మరో ఆరుగురు సభ్యులను నియమించింది. వీరంతా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి మూడేళ్లు లేదా వారికి 60 ఏళ్ల వయసు వచ్చేవరకు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నియామకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ లింక్ క్లిక్ చేసి చూడండి.

వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు ఇచ్చిందంటూ టీడీపీ ప్రచారం చేయడం చర్చకు దారితీసింది. లోక్​ సభలో బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు డబుల్ గేమ్ ఆడారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. చర్చకి వచ్చినప్పుడు ఒకలా, ఓటింగ్​ సమయంలో మరోలా వ్యవహరించాలని పేర్కొంది. చర్చ సమయంలో వైసీపీ సభ్యులు వ్యతిరేకమన్నారని, తీరా ఓటింగ్ కు వచ్చేసరికి మద్దతుగా జగన్ ఓటు వేయించాడనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. అయితే ఈ ప్రచారాన్ని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఇంతకూ ఈ ఓటింగ్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేసి చూడండి.

విద్యార్థులను వేధిస్తున్న ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేసిన ఘటన ఇవాళ ఏపీలోని కడప జిల్లా బద్వేల్‌లో జరిగింది. స్థానిక ఏవీఆర్​ స్కూల్ 6వ తరగతి విద్యార్థినులతో కంప్యూటర్ క్లాస్ చెప్పే టీచర్ పెంచలయ్య అసభ్యంగా ప్రవర్తించినట్లు విద్యార్థులు పేరెంట్స్‌కి చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన వారు వెంటనే బంధువులతో కలిసి పాఠశాలకు చేరుకున్నారు. టీచర్‌ను చుట్టుముట్టి పిడిగుద్దులు కురిపించారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడమే గాకుండా ‘పెళ్లి చేసుకుందాం’ అంటూ అమ్మాయిలను వేధిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింకులో చూడండి.

Next Story

Most Viewed