‘ఓపెన్’గానే అక్రమాలు.. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్

by Aamani |
‘ఓపెన్’గానే అక్రమాలు.. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్
X

దిశ, ములుగు ప్రతినిధి: 2024-25 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ స్టేట్ ఓపెన్ టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు ఈనెల 20 నుండి ప్రారంభమయ్యాయి. ములుగు జిల్లా కేంద్రంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా ఎగ్జామ్ రాసే అభ్యర్థుల నుంచి ఒక్కో సబ్జెక్టుకు రూ.300 నుంచి రూ.500 వసూలు చేస్తూ అభ్యర్థులను మాస్ కాపీయింగ్ కి ఎగ్జామ్స్ సెంటర్ ఉన్నతాధికారులే ప్రోత్సహిస్తున్నారనే వాదన జిల్లా కేంద్రంలో బహిరంగంగా చర్చ జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు, ప్రమోషన్ లో ఉన్న ప్రైవేట్ ఉద్యోగస్తుల నుంచి అడ్మిషన్లు సేకరించి ఎగ్జామ్స్ సెంటర్లో ఒకరికి బదులు మరొకరిని పరీక్ష రాయించడానికి ప్యాకేజీ మాట్లాడుకొని మరి ఎగ్జామ్స్ సెంటర్ లో కాపీయింగ్ జరుగుతుందని వాదన సైతం వినిపిస్తున్నాయి.

ఎస్ఎస్‌సీకి రూ.300 ఇంటర్ కి రూ.500..

తెలంగాణ స్టేట్ ఓపెన్ టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు బోర్డ్ ఎగ్జామ్స్ తరహాలో ఓపెన్ స్కూల్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది. ములుగు జిల్లా కేంద్రంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద పరీక్షలు రాసే అభ్యర్థులు ఇన్విజిలేటర్ల సహకారంతో ఎలాంటి వణుకు, భయం లేకుండా ఓపెన్ గానే చిట్టీలు పెట్టి రాస్తున్నారని చర్చ నడుస్తోంది . మాల్ ప్రాక్టీస్ లేకుండా చూడవలసిన ఇన్విజిలేటర్లు కాస్త కాసులకు కక్కుర్తి పడి పరీక్షలు రాసే అభ్యర్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద 300 రూపాయలు చొప్పున వసూలు చేసి చూసి రాసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారని,ఇలా ఓపెన్ టెన్త్ కు 300, ఓపెన్ ఇంటర్ కి 500 చొప్పున వసూలు చేస్తూ అభ్యర్థుల కంటే ముందే చూసి రాయడంపై ఆసక్తిని ప్రోత్సహిస్తున్నారని, పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నట్టు పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులు ఓపెన్ గానే చర్చించుకుంటున్నారు.

పరీక్ష కేంద్రాల చుట్టూ పకడ్బందీ పోలీస్ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ, ఇన్విజిలేటర్ల విద్యార్థుల దగ్గర్నుంచి నయానా భయానా సబ్జెక్టుకు ఒక విద్యార్థి నుండి 300 నుండి 500 వరకు రేటు నిర్ణయించి విద్యార్థుల దగ్గర్నుంచి వసూలు చేస్తూ తర్వాత వారు ఎలాంటి కాపీయింగ్ కి పాల్పడిన చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని, ఇదంతా ఎగ్జామ్స్ సెంటర్ చీఫ్ సూపర్డెంట్ పర్యవేక్షణలోనే జరుగుతుందని మరి కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా పరీక్షా కేంద్రాల్లో ఇలాంటి వసూళ్ల చిత్రం నడుస్తుందని జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

స్క్వాడ్ వచ్చినప్పుడు సమాచారం..

ఈనెల 20న ప్రారంభమైన తెలంగాణ స్టేట్ ఓపెన్ టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు బోర్డ్ ఎగ్జామ్స్ లో కాసులకు కక్కుర్తి పడ్డ ఎగ్జామ్ ఇన్విజిలేటర్లు అభ్యర్థులు మాస్ కాపీయింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో అనుకోకుండా వచ్చే స్టేట్ లెవెల్ స్క్వాడ్ ఉనికిని తెలుసుకొని ముందుగానే హెచ్చరించడం, పరీక్ష కేంద్రంలో ఏమి జరగడం లేదన్నట్టు నమ్మిస్తారని, అందుకే ఒక్కొక్కరి వద్ద డబ్బులు వసూలు చేసి పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి భయాలు లేకుండా కాపీయింగ్ జరగడానికి అనుకూల వాతావరణం నెలకొల్పుతారని జిల్లా కేంద్రంలో చర్చ జరుగుతుంది. ములుగు జిల్లా కేంద్రంలో 1400 మంది పరీక్ష రాసే అభ్యర్థులు ఉండగా ఆరు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది.

పరీక్ష జరుగుతున్న సమయంలో 2 రోజులలో స్టేట్ లెవెల్ స్క్వాడ్ పరీక్ష కేంద్రాల్లో తనిఖీ చేసి మాస్ కాపీయింగ్ చేస్తూ 19 మంది అభ్యర్థులను పట్టుకోవడం జిల్లా కేంద్రంలో ఏ మేరకు మాస్ కాపీయింగ్ జరుగుతుందో ఉదాహరణగా నిలుస్తోందని, మరికొందరు అభ్యర్థులు తనకి బదులు ఇంకొకరిచే ఎగ్జామ్ రాయించడానికి ఇన్విజిలేటర్లతో రూ.5వేల ప్యాకేజీ మాట్లాడుకొని మరి ఎగ్జామ్ లో చీటింగ్ చేస్తున్నారని జిల్లాలో జరుగుతున్న ఓపెన్ టెన్త్ పరీక్షల గురించి జిల్లా కేంద్రంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


Advertisement
Next Story

Most Viewed