SBI Clerk Notification: 13,735 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పూర్తి వివరాలివే..!

by Maddikunta Saikiran |
SBI Clerk Notification: 13,735 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పూర్తి వివరాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా దేశంలోని వివిధ బ్రాంచుల్లోని ఖాళీగా ఉన్న 13,745 క్లర్క్(Clerk) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://sbi.co.in/web/careers/current-openings ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 7 జనవరి 2025.

పోస్టులు, ఖాళీలు:

క్లర్క్(జూనియర్ అసోసియేట్) - 13,735

విద్యార్హత:

అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

ప్రిలిమినరీ ఎగ్జామ్‌, మెయిన్స్ ఎగ్జామ్‌, లోకల్ లాంగ్వేజ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వయోపరిమితి:

వయసు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు పదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ. 750 ఫీజు ఉంటుంది. మిగతా కేటగిరీలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40,000 వరకు జీతం ఉంటుంది.

Advertisement

Next Story