Komatireddy Rajagopal Reddy : నా మంత్రి పదవి అధిష్టానం చేతుల్లో ఉంది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |
Komatireddy Rajagopal Reddy : నా మంత్రి పదవి అధిష్టానం చేతుల్లో ఉంది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : నా మంత్రి పదవి(Ministerial post) అధిష్టానం చేతుల్లో ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ అంశం సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానం నేతలు చూసుకుంటున్నారని, నేను కూడా మంత్రి పదవి ఆశిస్తున్నానన్నారు. రాష్ట్రానికి కొత్త అసెంబ్లీ భవనం అవసరమని, సచివాలయం పక్కన ఎన్టీఆర్ గార్డెన్ లో కొత్త అసెంబ్లీ భవన నిర్మాణం జరిగితే వ్యూ చూడటానికి బావుంటుందన్నారు. ఇందుకోసం అవసరమైతే ఎఫ్టీఎల్ పరిధిని కుదించవచ్చని అభిప్రాయపడ్డారు.

సచివాలయం, అసెంబ్లీ, అమరవీరుల స్థూపం, హుస్సేన్ సాగర్ ఒడ్డున చూడ చక్కగా ఉంటాయన్నారు. సచివాలయం, అసెంబ్లీ పక్క పక్కన ఉంటే పాలన పరంగా బావుంటుందని వ్యాఖ్యానించారు. గోదావరి జలాలతో జంట నగరాలలోని కుంటలను, చెరువులను నింపొచ్చని.. ప్రభుత్వం దీనిపై పరిశీలన చేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed