- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంకా అద్దె గదులే.. చెట్ల కింద విద్యార్థులకు పాఠాలు
దిశ ప్రతినిధి, వికారాబాద్ : అది వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల. 2021లో కేవలం 15 మంది విద్యార్థులతో జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర హై స్కూల్ లో 3, 4 చిన్న చిన్న అద్దె రూమ్‌లలో ప్రారంభమైన తరగతులు నేటికీ ఐదేళ్లు దాటుతున్నా అదే దయనీయ స్థితిలో కొనసాగుతున్నాయి. ఒక గ్రూపు విద్యార్థులు క్లాసులు వినాలంటే, మిగతా రెండు గ్రూపుల విద్యార్థులు బయట చెట్ల కింద కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇదే ఘోరం అనుకుంటే కళాశాల ప్రిన్సిపాల్‌తో సహా అధ్యాపకులు కూర్చోవడానికి కనీసం ఒక ఆఫీస్ రూమ్ అందుబాటులో లేని స్థితిలో నేడు వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా వారికి పాఠాలు అర్థం అయ్యేలా బోధించడం కోసం, అధ్యాపకులే కళాశాల ప్రిన్సిపాల్‌తో సహా అందరు పెద్ద మనసుతో ముందుకొచ్చి ఆరు బయట, చెట్ల కింద కుర్చీలు వేసుకొని కూర్చుంటున్న పరిస్థితి నెలకొంది. వారి సహచర అధ్యాపకుడి పిరియడ్ అయిపోయే వరకు బయట కూర్చోవాల్సిందే. చేసేదిలేక కొన్ని క్లాసులు చెట్ల కిందనే చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐదేండ్లుగా దిక్కూ మొక్కు లేని వైనం..
గత ప్రభుత్వంలో మెతుకు ఆనంద్ ఎమ్మెల్యేగా ఉన్న 2021లో జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభం అయ్యింది. డిగ్రీ కళాశాల రాగానే ఒకప్పుడు వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు. అలాంటిది తమ ప్రభుత్వంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీతో పాటు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని ఊదరగొట్టారు. కానీ ఐదేళ్లుగా అతీగతి లేకుండా ధీనస్థితిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా డిగ్రీ కాలేజీ పరిస్థితి నెలకొన్నది. పార్టీ కార్యాలయాలకు, కుల సంఘాల భవనాలకు స్థలాలు కేటాయించిన గత ప్రభుత్వం.. అధికారులు, ప్రజా పాలకులు, యువత భవిష్యత్‌ను తీర్చిదిద్దే డిగ్రీ కళాశాలకు మాత్రం స్థలం కేటాయించలేకపోయారు.
ప్రజా పాలకుల స్వార్థం, అసమర్థత కారణమైనా, నాడు కలెక్టర్లుగా కొనసాగి పార్టీ కార్యాలయాలకు, కుల సంఘాలకు స్థలాలు మంజూరు చేసిన ఐఏఎస్ అధికారులు సైతం డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయింపులో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలున్నాయి. 15 మంది విద్యార్థులతో ప్రారంభమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదటి బ్యాచ్ 2021 - 22 విద్యార్థులు, ఈ ఏడాది తమ విద్యను పూర్తి చేసుకొని వెళ్లిపోయారు. 2022 - 23 రెండో బ్యాచ్ విద్యార్థులు 66 మంది ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్ చదువుతుండగా, 2023 -24 మూడో బ్యాచ్ విద్యార్థులు 43 మంది డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. మొదటి సంవత్సరానికి కూడా కొత్తగా ఇప్పటికే 24 అడ్మిషన్లు వచ్చాయని కళాశాల ప్రిన్సిపాల్ జే మల్లయ్య తెలిపారు.
మూత్రశాలలు లేక ఇక్కట్లు..
ఐదేళ్లుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం స్థలం కేటాయించాలని కళాశాల అధ్యాపకులు వేడుకుంటున్నా రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం స్పందిచకపోవడం బాధాకరం. గతంలో పనిచేసిన ఆర్డీవోతో విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. గత పాలకులు డిగ్రీ కళాశాల తెచ్చామంటూ డబ్బా కొట్టుకోవడం తప్ప కనీసంస్థలం కేటాయించే బాధ్యత తీసుకోలేకపోయారు. జిల్లా పాలకవర్గం, అధికార యంత్రాంగం యువత బంగారు భవిష్యత్‌ను తీర్చిదిద్దే విద్యా వ్యవస్థపై చిన్న చూపు చూస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎంతలా అంటే కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు, ముఖ్యంగా అమ్మాయిలకు ఒక మూత్రశాల కూడా లేని దీన స్థితిలో డిగ్రీ కాలేజీ ఉంది.
అమ్మాయిలు టాయిలెట్ వెళ్లాలంటే పక్కన ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల వారి అనుమతితో వారి మూత్రశాలలోకి వెళ్లి రావాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం క్రీడలు ఆడడానికి స్థలం లేదు. పొరపాటున విద్యార్థులు బయటకు వస్తే తమ విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని పక్కనే ఉన్న జడ్పీ బాలుర పాఠశాల సిబ్బంది విద్యార్థులపై అరిచే పరిస్థితి ఏర్పడింది. పాఠాలు చెప్పాలని తాపత్రయం ఉన్న అధ్యాపకులకు పాఠాలు చెప్పే పరిస్థితులుగాని, పరిసరాలు కానీ అక్కడ కనిపించడం లేదు.
కొత్త కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పందించేనా..?
నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంతోమంది అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు ఒకప్పుడు ప్రభుత్వ బడుల్లో, కళాశాలలో చదివిన వారే. ప్రైవేట్ విద్యా సంస్థలు రాజ్యమేలుతున్న ఈ తరుణంలో ప్రభుత్వ బడులు, కళాశాల పరిస్థితి నేడు అత్యంత దయనీయంగా మారాయి. ఇది ఎవరి తప్పో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వికారాబాద్ జిల్లా కేంద్రం అంటే ఒకప్పుడు విద్యా వ్యవస్థకు పెట్టింది పేరు. ఈ జిల్లా విద్యార్థులే కాక అనేక జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుకున్న చరిత్ర వికారాబాద్‌కు ఉంది. ఒకనాడు ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న శ్రీ అనంతపద్మనాభ స్వామి కళాశాల నేడు ప్రైవేట్ పరమైంది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా బోధన బాగున్నా సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అసంపూర్తిగా ఉన్న జూనియర్ కాలేజీ బిల్డింగ్ నిర్మాణం పూర్తయితే బాగుంటుందని విద్యా సంఘాల నాయకులు ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇన్నా ఎవరూ స్పందించని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పందించి జిల్లా కేంద్రంలో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్మించి సిరిసిల్ల, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలల స్థాయిలో ఇక్కడ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.