- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rameswaram Cafe blast: ఆ నిందితుడిని పట్టిస్తే.. రూ.10 లక్షల రివార్డు ఇస్తాం: ఎన్‌ఐఏ సంచలన ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు పట్టణంలోని రామేశ్వరం కెఫేలో సంభవించిన బాంబు పేలుడు కేసులో దర్యాప్తును ఎన్‌ఐఏ జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే దర్యాప్తు సంస్థ ఇవాళ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు నిందితుడి ఫొటోలను ఎన్ఐఏ అధికారులు విడుదల చేశారు. ఒకవేళ ఎవరైనా నిందితుడిని పట్టించినా, ఆచూకీ తెలిపినా వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ఇస్తామని వెల్లడించారు ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది.
కాగా, మార్చి 1న రామేశ్వరం కెఫేలో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పేలుడును సీరియస్‌గా తీసుకున్న కేంద్ర హోంశాఖ కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కెఫేలో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కదలికలను బట్టి ఎన్ఐఏ బృందం దర్యాప్తును ప్రారంభించింది. పేలుడులో ఆర్‌డీఎక్స్ వాడారని బాంబ్ ఎక్స్‌ప్లోజివ్ నిపుణులు వెల్లడించారు. కేసులో ఇప్పటి వరకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
కెఫేలో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తన చేతిలోని పేలుడు పదార్థాలున్న సంచిని అక్కడపెట్టి హడావుడిగా వెళ్లిన నిందితుడి సీసీ కెమెరా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. ఇందుకోసం 5 కి.మీ పరిధిలోని 300 సీసీ కెమెరాల చిత్రాలను విశ్లేషించారు. తెల్ల టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్కు కట్టుకుని నల్లబూట్లు, అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. టైమర్ బాంబు సంచి ఉంచే వేళ చేతికి గ్లవ్స్ ధరించి ఉన్నట్లుగా గుర్తించారు. అతడిని ప్రధాని అనుమానితుడిగా గుర్తించిన ఎన్‌ఐఏ అధికారులు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డును అందజేస్తామని ప్రకటించారు.