- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో క్రైస్తవ మిషనరీలు సేవ చేయకుండా BJP కుట్ర: మేడే రాజీవ్ సాగర్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు స్వచ్చందంగా సేవా చేస్తున్న బాల వికాస వంటి సంస్థలపై ఐటీ దాడులు చేయడం అన్యాయమని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. బుధవారం మీడియా ప్రకటనలో ఐటీ దాడులను తీవ్రంగా ఖండించారు. క్రైస్తవ మిషనరీ అయినందునే బాలవికాస సంస్ధపై కేంద్రం ఐటీ దాడులు చేయిస్తుందని మండిపడ్డారు. క్రైస్తవ మిషనరీ సంస్థలు దేశంలో సేవా కార్యక్రమాలు చేయకుండా కేంద్రం కుట్ర చేస్తుందని విమర్శించారు. లౌకికస్వామ్య దేశంలో కేంద్రం కావాలని ఇతర మతాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ దేశ ప్రజల మధ్య విద్వేశాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
మూడు దశాబ్ధాలుగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బాలవికాస సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో బాలవికాస మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయని గ్రామం లేదని, దశాబ్ధాలుగా గ్రామాల్లో మహిళలు, వృద్ధులకు సాయం చేస్తుంటే.. కేంద్రం మాత్రం మిషనరీ సంస్ధను ఐటీ దాడుల పేరుతో వేధిస్తున్నారని చెప్పారు. దేశాన్ని దోచుకుని విదేశాలకు పారిపోతున్న వారిని పట్టించుకోవడం మానేసి.. దేశానికి సేవ చేయడానికి విదేశాల నుంచి వస్తున్న వారిని ఇబ్బందులకు గురిచేయడం బీజేపీకే చెల్లుతుందన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు, క్రైస్తవ సమాజం బాలవికాస సంస్థలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.