- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రజాకర్ల రాజ్యం పోయి.. రామరాజ్యం రావాలే: Bandi Sanjay Kumar
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలన నుండి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని రజాకర్ల రాజ్యాన్ని అంతం చేసి రామరాజ్యాన్ని స్థాపించుకునేందుకు పార్టీ శ్రేణులు అందరూ కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో భాగంగా మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్స్‌లో సంజయ్ పార్టీ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సంజయ్ ప్రారంభ ఉపన్యాసం చేశారు.
నీళ్లు.. నిధులు... నియామకాల కోసం తెలంగాణ రావాలి అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారని సంజయ్ చెప్పారు. ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు సాగుతున్నాయని అన్నారు. గత ఎన్నికలకు ముందు మీ సంపాదన ఎంత.. ఇప్పుడు ఎంత.. అన్న విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు, ప్రజా ప్రతినిధుల ఆస్తులపై, గతంలో ఇచ్చిన హామీలు - అమలు, ఖర్చులు - అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు మాత్రమే పెట్టారు.. కానీ ఆయన విగ్రహాన్ని ఎందుకు స్థాపించలేదో చెప్పాలన్నారు.
దళితులకు ఇచ్చిన ముఖ్యమంత్రి పదవి, మూడు ఎకరాల భూమి, దళిత బంధు పథకాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో కట్టిన సచివాలయాన్ని అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభించకుండా సీఎం తన పుట్టినరోజున ప్రారంభించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. రైతులను, నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. అప్పట్లో మద్యం ద్వారా రూ.10వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఇప్పుడు ఏడాదికి రూ.40 వేల కోట్ల రూపాయలు వస్తున్నాయన్నారు. వీటిలో నామమాత్రంగా సంక్షేమ పథకాలకు ఖర్చు చేసి మిగతా డబ్బులను దోచుకున్నారని సంజయ్ ఆరోపించారు. 317 జీవో ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
ఈనెల 30వ తేదీ లోపు సమస్యలు పరిష్కారం కాకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సంజయ్ హెచ్చరించారు. రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలన నుండి విముక్తి పొందేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వ్యక్తిగత స్వార్థం లేకుండా సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని సంజయ్ పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మోదీ ఆధ్వర్యంలో అమరవీరుల త్యాగాలు ఫలించేలా రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని సంజయ్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.