- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..!
దిశ, వెబ్‌డెస్క్: ఎండలు దంచికొడుతోన్న వేళ కురుస్తోన్న వర్షాల కారణంగా జనాలకు ఉపశమనం కలుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పదిహేను రోజుల నుంచి అక్కడక్కకడ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెలంగాణలో మళ్లీ మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆవర్తనం ఒకటి పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0. 9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు దిశ నుంచి వీస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే చాన్స్ ఉందని తెలిపారు. ఇవాళ, రేపు కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 – 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయన్నారు. నైరుతి రుతుపవనాలు కూడా ఈ సంవత్సరం తొందరగానే వస్తున్నాయని ఐఎండీ ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే.