Railway News: ప్రయాణికులకు బిగ్ షాక్.. వందే భారత్‌తో సహా 22 ట్రైన్లు రద్దు!

by Shiva Kumar |
Railway News: ప్రయాణికులకు బిగ్ షాక్.. వందే భారత్‌తో సహా 22 ట్రైన్లు రద్దు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులకు రైల్వే శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు భారీ సంఖ్యలో ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గురువారం నుంచి రూర్కీ రైల్వే స్టేషన్‌‌లో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో వందేభారత్‌తో సహా 22 రైళ్లను రద్దు చేయగా.. దాదాపు 18 రైళ్లను రూటు మార్చేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. టైన్ల రద్దుతో హరిద్వార్‌, రిషికేశ్‌ ప్రయాణికులపై ఎక్కువగా పడబోతోంది. రూర్కీ రైల్వే స్టేషన్‌‌లో నాన్‌ ఇంటర్ లాకింగ్‌ పనులు 7 రోజుల పాటు కొనసాగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు. జూన్‌ 27 నుంచి మరమ్మతు పనులు ప్రారంభమై జులై 3 నాటికి పూర్తి అవుతాయని వారు తెలిపారు.

Next Story

Most Viewed