Raghunandhan Rao: వివక్ష అంటే ఇది రేవంత్ రెడ్డి.. రఘునందన్ రావ్ ట్వీట్

by Ramesh Goud |
Raghunandhan Rao: వివక్ష అంటే ఇది రేవంత్ రెడ్డి.. రఘునందన్ రావ్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వివక్ష అంటే ఇది అని చెబుతూ నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది రేవంత్ రెడ్డి అని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో రూ.4369.143 కోట్లతో అభివృద్ది పనులకు శ్రీకారం అని గతంలో ఓ దిన పత్రిక ప్రచురించిన కథనాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిని ప్రస్తావిస్తూ.. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపింస్తుంది అన్న రేవంత్ రెడ్డి మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "వివక్ష అంటే ఇది" రేవంత్ రెడ్డి అంటూ.. గాడిద గుడ్డు ముచ్చట్లు కాదు నీ సొంత నియోజకవర్గానికి 4369కోట్లు కేటాయించుకుని 118 నియోజకవర్గాలకు సమానంగా నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిన నువ్వు సమానత్వం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది అని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు.



Next Story