- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nayanthara : కర్ర, కత్తి పట్టుకొని ఎర్ర చీరలో అదిరిపోయే ఫైట్ చేసిన నయనతార.. టీజర్ అదిరిందిగా..!
దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజు నయనతార ( Nayanthara ) బర్త్ డే కావడంతో సినీ నటులు, ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. అయితే, ఈ రోజు ఈమె పుట్టిన రోజు సందర్భంగా నయనతార మెయిన్ లీడ్ గా తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ కొత్త మూవీని ప్రకటించారు. ఈ మూవీకి " రక్కయి " ( RAKKAYIE ) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పెట్టారు. అలాగే, టైటిల్ తో పాటు టీజర్ ని కూడా విడుదల చేసి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు.
రక్కయి టీజర్లో.. " చిన్న బాబు ఏడుస్తూ ఉంటాడు.. అదే సమయంలో నయనతార రోలు లో మిరపకాయలు వేసి దంచుతూ ఉంటుంది. బాబు ఇంకా పెద్దగా ఏడవడం మొదలు పెడతాడు. ఇక రోకలి బండని అక్కడ పడేసి, బాబు కి పాలు పట్టించి, చిన్నగా పడుకోబెడుతుంది. ఆ తర్వాత నయనతార మీదకు కొందరు రౌడీలు దాడి చేయడానికి వచ్చినప్పుడు వాళ్లపై ఒంటరిగా పోరాటం చేసింది. కర్ర, కత్తి పట్టుకొని ఎరుపు చీరలో అదిరిపోయే ఫైట్ చేసింది" నయన్. ఈ సినిమాలో ఇంత వరకు చేయని పాత్ర చేసినట్లు కనిపిస్తుంది. ఇది పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీసినట్లుగా తెలుస్తోంది. టీజర్ చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.