నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే.. గద్వాల ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

by Shiva |   ( Updated:2025-04-22 07:17:58.0  )
నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే.. గద్వాల ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మారిన బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ కొనసాగుతోన్న వేళ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (Bandla Krishna Mohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ముమ్మాటికీ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేనని చెప్పుకొచ్చారు. గద్వాల (Gadwal) నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు. అంతేకానీ తాను ఎప్పుడు, ఎక్కడా కాంగ్రెస్ (Congress) కండువాను మెడలో వెసుకోలేదని కామెంట్ చేశారు. సొంత ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తే నష్టపోయేది చివరికి ప్రజలేనని బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.



Next Story

Most Viewed