Inter Board: ఉద్యోగ భద్రత కల్పించండి.. ఇంటర్ బోర్డ్ ఎదుట గెస్ట్ లెక్చరర్ల ఆందోళన

by Ramesh Goud |   ( Updated:2024-08-16 14:55:47.0  )
Inter Board: ఉద్యోగ భద్రత కల్పించండి.. ఇంటర్ బోర్డ్ ఎదుట గెస్ట్ లెక్చరర్ల ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగ భద్రత కల్పించాలని ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట గెస్ట్ లెక్చరర్లు ఆందోళన నిర్వహించారు. గెస్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చూస్తూ.. అతిథి అధ్యాపక సంఘం ఆధ్వర్యంలో ఛలో ఇంటర్ బోర్డుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లిలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ అతిథి అధ్యాపకులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గెస్ట్ లెక్చరర్లు పాల్గొన్నారు. వారిని అడ్డుకునేందుకు ఇంటర్ బోర్డు వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఈ సందర్భంగా 1654 మంది గెస్ట్ లెక్చరర్లకు భద్రత కల్పించి, కంటిన్యూగా కొనసాగించాలని నినాదాలు చేస్తూ.. తక్షణమే ఈ విద్యాసంవత్సరం కొనసాగింపు రెన్యూవల్ జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం టీజీపీఎస్సీ ప్రకారం జేఎల్ నోటిఫికేషన్ తో సంబందం లేకుండా.. 42వేల వేతనంతో 12 నెలలు కొనసాగింపును తక్షణమే అమలు చేయాలని పట్టుబట్టారు. అంతేగాక ఇందులో మహిళ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలని ఆందోళన చేశారు. ఇక గత 10సంవత్సరాలుగా నిరంతరం విద్యార్థులకు విద్య అందిస్తూ.. విద్యావ్యవస్థలో అనేక మార్పులు తెచ్చామని అతిథి ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed