- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరో భారీ పోరాటానికి సిద్ధమైన TJS చీఫ్ కోదండరాం!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి నాయకత్వం వహించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం మరో పోరాటానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ సర్కార్ పాలసీల్లోని లోపాలను ఎత్తి చూపుతూ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ దగ్గర నుంచి నిర్మాణం వరకు జరిగిన అవకతవకలపై ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి విస్తృతంగా ప్రచారం చేశారు. మరోవైపు రాష్ట్ర విభజన చట్టం 2014లో ఇచ్చిన హామీల సాధన కోసం కేసీఆర్ ప్రయత్నం చేయలేదని ఆరోపిస్తూ ఢిల్లీలో జన సమితి పార్టీ నేతలు ధర్నాలు చేశారు.
ఈ క్రమంలోనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కేసీఆర్‌లను ఇరుకున పెట్టేందుకు విభజన హామీల సాధన ఉద్యమం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వివిధ జిల్లాల్లోని తెలంగాణ ఉద్యమకారులతో మాట్లాడినట్లు సమాచారం. ఇందులో భాగంగా సంక్రాంతి పండుగ అనంతరం హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయిలో భారీ సదస్సుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.