- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్థరాత్రి వేళ ప్రభాస్ అభిమానుల హల్‌చల్
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇంటి ముందు అర్థరాత్రి వేళ ఆయన అభిమానులు హల్‌చల్ చేశారు. అక్టబోర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 22వ తేదీ అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి ముందు భారీగా చేరిన ప్రభాస్ అభిమానులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. విషయం తెలియగానే పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, ప్రభాస్ అభిమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయినా పోలీసులు లోనికి అనుమతించక పోవడంతో ప్రభాస్‌ను కలవాలంటూ వారంతా రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టి పంపించారు.
ఇదిలా ఉంటే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నేడు అనేకమంది సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక ఫ్యాన్స్ (Fans) అయితే రాష్ట్రం మొత్తం ఆయన ఫ్రెక్సీలతో రచ్చ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో కూడా అనేక ప్రాంతాల్లో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.