దాని కోసమైనా గ్రూప్-1 ఎక్జామ్ వాయిదా వేయండి!.. ఆర్ఎస్ ప్రవీన్ కుమార్

by Ramesh Goud |
దాని కోసమైనా గ్రూప్-1 ఎక్జామ్ వాయిదా వేయండి!.. ఆర్ఎస్ ప్రవీన్ కుమార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 ఎక్జామ్ కనీసం ఒక నెల అయినా వాయిదా వేస్తే బాగుంటుందని, 8 సంవత్సరాలుగా ఈ పరీక్ష కోసం ఎదురు చూస్తున్న అందరు నిరుద్యోగ అభ్యర్ధులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని టీఎస్పీఎస్సీని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. అదే రోజున మరో ఎక్జామ్ ఉండటంతో గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలని ట్విట్టర్ వేధికగా అభ్యర్ధించారు. జూన్ 9వ తారీఖు నాడు జరగబోయే గ్రూప్-1 ఎగ్జామ్ ను కనీసం ఒక నెల (మాత్రమే) అయినా వాయిదా వేస్తే బాగుంటుందని, దీనిపై టీఎస్‌పీఎస్‌సీ ఒక్క సారి ఆలోచించాలని కోరారు.

ఎందుకంటే.. అదే రోజు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇంటలిజెన్సు బ్యూరో (IB) ఇన్స్‌పెక్టర్ ఎగ్జామ్ కూడా ఉందని, దానికి చాలా మంది మన తెలంగాణ నిరుద్యోగులు అప్లై చేశారని తెలిపారు. అలాగే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు (రెవెన్యూ మరియు పోలీసులు ముఖ్యంగా) గత నాలుగు నెలల నుండి ఎన్నికల నిర్వహణలో తలమునకైనందు వల్ల వాళ్లకు బాగా ప్రిపేర్ అయ్యే అవకాశం లేదని, వాళ్లకు ఒక నెలైనా టైం ఇస్తే.. కనీసం లాస్ ఆఫ్ పే సెలవు మీద చదువుకోని పరీక్షకు వస్తారని అన్నారు.

ఈ విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి గత 8 సం.లు గా గ్రూప్-1 కోసం ఎదురు చూస్తున్న అందరు నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని, ‘అన్ని జాగ్రత్తలు’ తీసుకొని పరీక్షను పకడ్భందీగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతున్నదని చెప్పారు. అదే విధంగా ఏఈఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంతో కాలంగా నియామక పత్రాల కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. వీరికి వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే 2017 పీఈటి అభ్యర్థుల గోస మరో డీఎస్సీ-2008 క్షోభలాగా మారనివ్వరని ఆశిస్తున్నాం అని ఆర్ఎస్పీ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed