మావోయిస్టులను నమ్మి మోసపోవద్దు.. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

by Sumithra |
మావోయిస్టులను నమ్మి మోసపోవద్దు.. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
X

దిశ, ఆసిఫాబాద్ : మావోయిస్టుల మాయమాటలు నమ్మి ఆదివాసీ యువత మోసపోవద్దని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిర్యాణి మండలంలోని మంగి గ్రామలో మెగా వైద్య శిబిరం నిర్వహించి 1000 మంది వైద్యపరీక్షలు నిర్వహించారు. అలాగే 500 మంది దుప్పట్లు, 10 గిరిజన యువకులకు వాలీబాల్ కిట్లు అందజేశారు. అనంతరం ఆయన గిరిజన యువతను ఉద్దేశించి మాట్లాడారు ఆ ప్రాంతంలో ఆత్మహత్యల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదని గిరిజన యువతకు సూచించారు. గిరిజన యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, చదువుతో పాటు క్రిడలతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. గ్రామాల్లో ఏవరైనా అపరిచిత వ్యక్తులు వస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీసులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని, ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తేవాలని ఎస్పీ చెప్పారు.

Advertisement

Next Story