సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన పాలమూరు నేతలు

by Naveena |
సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన పాలమూరు నేతలు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు శుభాకాంక్షలు తెలిపారు. నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి, సిడబ్ల్యుసి మెంబర్ డాక్టర్ వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, జి మధుసూదన్ రెడ్డి,వాకిటి శ్రీహరి, కూచికుల రాజేష్ రెడ్డి,పర్ణిక రెడ్డి , పిసిసి అధికార ప్రతినిధి బాలాజీ సింగ్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి..అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed