Ponnam: రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు

by Ramesh Goud |
Ponnam: రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి(Sankranthi) పండుగ సందర్భంగా తెలంగాణ బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రజలకు విషెష్(Wishes) చెప్పారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ఆయన.. సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు, పాడిపంటలతో రైతులు జరుపుకునే పండుగ అని, ఈ సందర్భంగా రైతన్నలందరికీ మకర సంక్రాంతి(Makara Sankranthi) పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని, ప్రజల జీవితాల్లో ఈ సంక్రాంతి పండుగ సుఖసంతోషాలను నింపాలని, ప్రజలు సిరి సంపదలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సంస్కృతి సాంప్రదాయాలు పరిమళించే ఈ సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలతో ప్రతి ఇంటా పండగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని పొన్నం కోరుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed