Koneru Humpy : నార్వే చెస్ వుమెన్-2025 బరిలో కోనేరు హంపి

by Sathputhe Rajesh |
Koneru Humpy : నార్వే చెస్ వుమెన్-2025 బరిలో కోనేరు హంపి
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల నెం.1 చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి నార్వే చెస్ వుమెన్-2025 బరిలో దిగనున్నారు. గత కొన్నేళ్లుగా ఈ టోర్నీకి దూరంగా ఉంటున్న ఆమె ఈ సారి పోటీలో నిలవనున్నారు. వరల్డ్ క్లాసికల్ చెస్‌లో ఆరో స్థానంలో ఉన్న హంపి గతేడాది మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్ని సత్తా చాటారు. టోర్నీలో ఆడనుండటంపై హంపి బుధవారం స్పందించారు. ‘ ప్రతిష్టాత్మక నార్వే చెస్ వుమెన్ టోర్నమెంట్ ఆడటం గౌరవంగా భావిస్తున్నా..’ అన్నారు. ‘హంపి సాధించిన విజయాలు తన నైపుణ్యాన్ని తెలుపుతాయి. నార్వే చెస్ వుమెన్-2025లో ఆడేందుకు సగర్వంగా స్వాగతిస్తున్నాం.’ అని నార్వే చెస్ డైరెక్టర్ చెల్ మ్యాడ్‌లండ్ అన్నారు. నార్వే చెస్ వుమెన్-2025లో గట్టి పోటీదారుగా హంపి బరిలో దిగుతున్నారు. నార్వే చెస్ వుమెన్-2025 టోర్నీ మే 26 నుంచి జూన్ 6 వరకు జరగనుంది.ఈ టోర్నీలో గెలిచిన పురుషులు, మహిళలకు సమానంగా ప్రైజ్ మనీ అందించనున్నారు.

Advertisement

Next Story